Jyothika | ‘కంగువ’ సినిమా రివ్యూలపై జ్యోతిక సీరియస్

-

Jyothika | తమిళ స్టార్ సూర్య నటించిన ‘కంగువ(Kanguva)’ సినిమా భారీ అంచనాలనడుమ విడుదలై బాక్సాఫీస్ బొక్కబోర్లా పడింది. ఊహించని ఫలితాలను చూసి మూవీ టీమ్ కళ్లుబైర్లు కమ్మాయి. దీంతో ప్రస్తుతం సూర్య.. ఎలాగైనా హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘కంగువ’ సినిమా రివ్యూలపై హీరోయిన్, సూర్య సతీమణి జ్యోతిక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలా సినిమాల కంటే ‘కంగువ’ బెటర్ అని అన్నారు. కొన్ని చెత్త సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్‌గా రాణించాయని, వాటితో పోల్చుకుంటే ‘కంగువ’ చాలా బెటర్‌ అని జ్యోతిక చెప్పింది.

- Advertisement -

‘‘దక్షిణాదిలో చాలా చెత్త సినిమాలు కమర్షియల్‌గా విజయం సాధించాయి. నా భర్త నటించిన ‘కంగువ’ వాటితో పోల్చుకుంటే చాలా మంచి సినిమా. ఈ సినిమా రివ్యూల విషయంలో చాలా మంది మరీ దారుణంగా రాశారు. సినిమా ప్రారంభంలో కొద్దిసేపు ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. కొన్నికొన్ని సన్నివేశాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోకపోయి ఉండొచ్చు. కానీ, అది చేయడానికి టీమ్ చాలా కష్టపడింది. ‘కంగువా’ను వైవిద్య చిత్రంగా తీర్చిదిద్దింది. ఈ సినిమా విషయంలో మీడియా తీరు అన్యాయంగా ఉంది’’ అని చెప్పింది జ్యోతిక(Jyothika).

Read Also: ‘ప్రియాంక’ను ఒంటరిగా వ్యాన్‌లోకి రమ్మన్న డైరెక్టర్
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

War 2 | వార్-2 వాయిదా తప్పదా..?

వార్-2(War 2) విడుదల వాయిదా తప్పదా? మల్టీస్టారర్‌గా భారీ బడ్జెట్‌తో వస్తున్న...

KCR | అసెంబ్లీకి వస్తున్నా: కేసీఆర్

బుధవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వీటికి ప్రతిపక్ష...