Amaran | సాయి పల్లవికి జ్యోతిక కితాబు.. ఏమనంటే..

-

నటి జ్యోతిక(Jyothika) తాజాగా విడుదలైన అమరన్ సినిమాను వీక్షించారు. ఆ తర్వాత నేచురల్ బ్యూటీ సాయిపల్లవిపై పొగడ్తల వర్షం కురిపించారు. ‘అమరన్(Amaran)’ సినిమాలో సాయి పల్లవి నటన అద్భుతంగా ఉందన్నారు. జ్యోతిక సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘‘సాయి.. నీ వర్క్‌కు నేనెప్పుడూ అభిమానినే. నువ్వు చాలా గొప్ప నటివి. మంచిమంచి పాత్రలు ఎంచుకోవడమే కాకుండా వాటికి న్యాయం చేస్తావు. ఎప్పటికీ నిన్ను ఇష్టపడుతూనే ఉంటా. ‘అమరన్’ క్లైమాక్స్‌లో నీ నటన గురించి చెప్పడానికి నాకు మాటలు చాలట్లేదు. అది నాకెంతో నచ్చింది. నువ్వు కెరీర్ పరంగా మరెన్నో కొత్త శిఖరాలను అందుకోవాలని కోరుకుంటున్నా’’ అని జ్యోతిక పోస్ట్ పెట్టారు. ఆమె పోస్ట్‌కు సాయి పల్లవి కూడా స్పందించారు. ‘మీరు సినిమా చూస్తున్నారని తెలిసినప్పటి నుంచి భయం భయంగా ఉంది’ అని బదులిచ్చింది.

- Advertisement -

‘‘మీరు అమరన్(Amaran) సినిమా చూస్తారని తెలిసినప్పటి నుంచి కూడా మీకు నచ్చుతుందో లేదో అని భయం భయంగా ఉంది. మీ మాటలు నాకెంతో విలువైనవి. సినిమా మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది’’ అని సాయి పల్లవి(Sai Pallavi) రిప్లై ఇచ్చింది. ఇదిలా ఉంటే మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘అమరన్’ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమా తొలి రోజు నుంచి కూడా భారీ కలెక్షన్లను రాబట్టింది.

Read Also: హైదరాబాద్‌లో సల్మాన్.. వాళ్లందరినీ చెక్ చేయాల్సిందే..
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...