Keerthy Suresh | పెళ్ళెప్పుడో చెప్పిన కీర్తి సురేష్.. కానీ..

-

మహానటి కీర్తి సురేష్(Keerthy Suresh) మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టడానికి సిద్ధమైందని కొన్ని రోజులుగా వార్తలు సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నాయి. తన ప్రేమికుడితోనే అమ్మడి వివాహం జరగనుందని కూడా వార్తలు వచ్చాయి. ఆంటోని తట్టిల్(Antony Thattil) అనే వ్యక్తితో కీర్తి సురేష్ చాన్నాళ్లుగా రిలేషన్‌లో ఉంది. కానీ ఎక్కడా కూడా ఈ విషయం బయటపడకుండా జాగ్రత్త పడింది. కానీ కొచ్చికి చెందిన ఆంటోనీని అతి త్వరలోనే వివాహం చేసుకోనున్నారన్న వార్తలు బయటకు వచ్చాయి.

- Advertisement -

కానీ ఈ విషయంపై ఇప్పటి వరకు కీర్తి స్పందించకపోవడంతో ఇవి కూడా రూమర్లే అని చాలా మంది అనుకున్నారు. కాగా తాజాగా ఈ వార్తలు వాస్తవమేనని కీర్తి సురేష్ చెప్పింది. కాకపోతే ఇక్కడ తన పెళ్ళి వాస్తవమనే చెప్పింది తప్పితే వరుడు ఎవరన్నది మాత్రం అమ్మడు ఇంకా చెప్పలేదు. ఈరోజు కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న సందర్భంగా కీర్తి ఈ విషయం తెలిపారు.

‘‘వచ్చే నెలలో పెళ్ళి చేసుకోనున్నాను. అందుకే తిరుమల వేంకటేశ్వరుడి దర్శనం కోసం వచ్చాను. గోవాలో వివాహ వేడుక జరగనుంది’’ అని చెప్పింది కీర్తి(Keerthy Suresh). ఈ విషయం తెలియడంతో అమ్మడి అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కీర్తి సురేష్ తన అప్‌కమింగ్ మూవీ ‘బేబీ జాన్’తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. ఈ మూవీ వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కుతోంది. కోలీవుడ్‌లో విడుదలైన ‘తెరీ’కి రీమేక్‌గా ‘బేబీ జాన్’ తెరకెక్కుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

Read Also: చలికాలంలో కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయా..? ఇలా చేసి చూడండి..
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Rythu Bharosa | ముగిసిన క్యాబినెట్ భేటీ.. రైతు భరోసాపై రేవంత్ కీలక ప్రకటన

తెలంగాణ క్యాబినెట్(Telangana Cabinet) సమావేశం ముగిసింది. అజెండలోని 22 అంశాలపై చర్చించిన...

వణికిస్తున్న HMPV వైరస్.. తెలంగాణ లో కేసులపై స్పందించిన హెల్త్ డైరెక్టర్

చైనాలో పెద్దఎత్తున నమోదవుతున్న హ్యూమన్ మెటా న్యూమో వైరస్ (HMPV Virus)...