నాకు కాబోయేవాడు అలా ఉండాలి – అందాల భామ మేఘా ఆకాష్

actress Megha Akash announced about her fianc should be like that

0
89
mega akash

అందాల భామ మేఘా ఆకాష్ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. అందం అభినయంతో టాలీవుడ్ లో ఎంతో మంది సినిమా అభిమానులని సంపాదించుకుంది. తెలుగుచిత్ర సీమలో యంగ్ హీరో నితిన్ తో లై సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ మేఘా ఆకాష్. ఇక తర్వాత నితిన్ తో చ‌ల్ మోహన్ రంగ అనే సినిమాలో నటించింది మేఘా.

తర్వాత తమిళ్ ఇండస్ట్రీకి వెళ్ళింది అక్కడ వరుస సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. కోలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఇటీవల రాజ రాజ చోర చిత్రంతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకుంది.
ఇప్పుడు డియర్ మేఘా అనే సినిమాతో రాబోతుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 3న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ మేఘా ఆకాష్ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది.

డియర్ మేఘ కథ విన్నప్పుడు చాలా నచ్చింది. అందుకే ఒకే చెప్పాను అని తెలింది ఈ ముద్దుగుమ్మ.
ఇక తనకు కాబోయేవాడి గురించి కూడా చెప్పింది, తాను తప్పకుండా లవ్ మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పింది. నేను నాలుగో తరగతి చదువుతున్నప్పుడు నా పక్కన కూర్చునే అబ్బాయితో ఫస్ట్ క్రష్ ఏర్పడింది. అది నా ఫస్ట్ లవ్ అని తెలిపింది మేఘా. నాకు కాబోయే వాడు మంచోడు అయి ఉండాలి. నన్ను నాలా ఉండనివ్వాలి అని తెలిపింది ఈ అందాల తార