స్వర్గంలో రంభ గా మోనాల్ గజ్జర్ – ఏ సినిమా అంటే

actress Monal Ghajjar as Rambha in heaven

0
110

టాలీవుడ్ మ‌న్మ‌ధుడు నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన ఎంత సూప‌ర్ హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా బంగార్రాజు అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.
బంగార్రాజు క్యారెక్టర్ తో సినిమాను ప్లాన్ చేసుకున్నారు ద‌ర్శ‌కుడు కళ్యాణ్ కృష్ణ. ఇప్ప‌టికే వ‌ర్క్ అంతా పూర్తి అయింది. తాజాగా ఈ సినిమాలో బిగ్ బాస్ బ్యూటీ నటి మోనాల్ గజ్జర్ ప్రధాన పాత్ర పోషిస్తోందని తెలుస్తోంది.

స్వర్గంలో ఉండే రంభ పాత్రలో నటిస్తోందట‌. నాగార్జునతో కలిసి ఒక పాటలో నర్తించనుంది. బంగార్రాజు సినిమాలో స్వర్గంలో సుదీర్ఘమైన ఎపిసోడ్ ఉందని తెలుస్తోంది. అందుకే ఆమెని సంప్ర‌దించార‌ట ఆమె కూడా నాగార్జున‌తో సినిమా అనేస‌రికి ఒకే చెప్పింద‌ని తెలుస్తోంది.

యమలీల తరహాలో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ సరదా ఎపిసోడ్‌ని రూపొందిస్తున్నారు. ఇక ఈనెల చివ‌రి వారంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవ‌కాశం ఉంది అంటున్నారు. ఇటు మోనాల్ అభిమానులు కూడా దీని కోసం వెయిట్ చేస్తున్నారు.