పడక సుఖం అందిస్తేనే ఛాన్స్.. కాస్టింగ్ కోచ్‌లో బాలీవుడ్ బ్యూటీ హాట్ కామెంట్స్

-

సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ అనేది లేడీ యాక్టర్ల పాలిట భూతంలా ఉంది. ఎవరు బయటకు వచ్చి చెప్పినప్పటికీ దీనిపై యాక్షన్ తీసుకున్న ఘటనలు చాలా తక్కువగానే ఉంటాయి. గతంలో అసలు కాస్టింగ్ కోచ్ అనేది ఒకటి ఉందని కూడా బయట ప్రపంచానికి తెలియదు. కొంత కాలంగానే కొందరు భామలు ధైర్యం చేసి బయటకు వచ్చి తాము ఎదుర్కొన్న కాస్టింగ్ కోచ్ అనుభవాలను వెల్లడిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ భామ, సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్(Raveena Tandon).. ఈ అంశంపై సంచలన విషయాలు వెల్లడించారు. అవకాశం కావాలంటే పడక సుఖం అందించాల్సిందేనని, ప్రస్తుతం స్టార్ హీరోయిన్లుగా ఉన్న వారు కూడా ఎప్పుడో ఒకసారి దీనిని ఎదుర్కొన్నవారేనని వెల్లడించారు. దీనికి తాను కూడా ఏమీ మినాహింపు కాదని చెప్పారు.

- Advertisement -

‘‘సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ అనేది అతిపెద్ద సమస్యగా ఉందనేది ఓపెన్ సీక్రెట్. అందరికీ తెలిసినా యాక్షన్ తీసుకోలేనటువంటిది. బాలీవుడ్, టాలీవుడ్, ఇలానే ప్రతి వుడ్‌లో కూడా హీరోయిన్‌లో, అవకాశం కోసం ప్రయత్నించే మహిళలు దీనిని ఎదర్కొంటున్నారు. అవకాశం కావాలంటే వారి కోరికలు తీర్చాలని సిగ్గు లేకుండానే డిమాండ్ చేసేవారు. ఇండస్ట్రీలోకి రావాలన్నా.. నిలబడాలన్నా వారికి పడక సుఖం అందించాల్సిందే. సినీ ఫీల్డ్‌లోని ప్రతి డిపార్టుమెంట్లో ఈ భూతం వేళ్లూనుకుని ఉంది. కాస్టింగ్ కోచ్ చెప్పినట్లు చేయకుంటే లేనిపోని అభాండాలు మోపి తొక్కిపారేస్తారు’’ అని Raveena Tandon కీలక వ్యాఖ్యలు చేశారు.

Read Also: పూర్తయిన ఐసీసీ ఛైర్మన్ ఎంపిక.. లాంఛనంగా ఎన్నిక..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Hydra | మనసు చంపుకుని పనిచేయాల్సి వస్తుంది: హైడ్రా రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(Hydra) చేపడుతున్న కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆసక్తికర...

Harish Rao | రోడ్డుపై కుటుంబ సర్వే దరఖాస్తులు.. మండిపడ్డ హరీష్ రావు

Harish Rao | సమగ్ర కుటుంబ సర్వేను తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం...