కొత్త వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన తాప్సీ

Actress Taapsee enters a new business

0
97

సినీ పరిశ్రమలో చాలా మంది ఓపక్క సినిమాలు చేస్తూ మరో పక్క వ్యాపారాలు చేస్తున్నారు. ఇంకొందరు చిత్ర నిర్మాణ సంస్ధల్లోకి వస్తున్నారు. నిర్మాతలుగా మారి సినిమాలు చేస్తున్నారు. అలాగే మరికొందరు సినిమా థియేటర్ బిజినెస్ లోకి వస్తున్నారు. ఇక బాలీవుడ్ లో చాలా మంది ఇలాంటి ఆలోచనలతో ఉండేవారు. కాని ఇప్పుడు తెలుగు చిత్ర సీమలో కూడా చాలా మంది ఇలా ఇతర వ్యాపారాలపై ఫోకస్ చేస్తున్నారు. ఇక్కడ సంపాదించిన డబ్బును మరొక రంగంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు.

చిత్ర నిర్మాణంలో హీరోయిన్లు రావడం చాలా తక్కువ. దక్షిణాది చిత్రాలతో పాటు హిందీ సినిమాలలో కూడా నటిస్తున్న అందాల తార తాప్సీ ఇప్పుడు చిత్ర నిర్మాణంలోకి అడుగు పెడుతోంది.
ఔట్ సైడర్ ఫిలిమ్స్ పేరిట తాజాగా ఓ ప్రొడక్షన్ హౌస్ ను నెలకొల్పింది.

అయితే ఆమెతో పాటు నిర్మాత, రచయిత ప్రంజల్ ఖండ్ దియాతో కలసి చిత్ర నిర్మాణాన్ని ఆమె చేబడుతోంది. క్వాలిటీతో కూడిన అర్థవంతమైన, వినోదాత్మక చిత్రాలను మా బ్యానర్ పై నిర్మిస్తాం. నాలా ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేని టాలెంట్ ఉండి, ఛాన్సుల కోసం ఎదురుచూస్తున్న యువకులకు
అవకాశాలు కల్పిస్తాం అని తాప్సీ తెలిపారు. మొదటి సినిమా ఓ థ్రిల్లర్ చిత్రం చేస్తున్నారు .ఇందులో తాప్సీ కీలక పాత్ర చేయనున్నారట.