శర్వానంద్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న తాజా మూవీ ఆడవాళ్లు మీకు జోహార్లు. సినిమా టైటిల్ తోనే ఆడవాళ్లకు కనెక్ట్ అయిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ రొమాంటిక్ మూవీకి తిరుమల కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన, పోస్టర్లు, సాంగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ చెప్పింది చిత్ర బృందం. ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. మొత్తానికి ఈ సినిమా ఫుల్ అండ్ ఫ్యామిలీ స్టొరీగా ఈ ట్రైలర్ చూస్తే మనకు అనిపిస్తుంది.
https://www.youtube.com/watch?v=-xxCWONP_ko&feature=emb_title
ఇక ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీత స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమాలో కుష్బూ, సీనియర్ నటి రాధిక అలాగే ఊర్వశి లాంటి సీనియర్ హీరోయిన్స్ అందరూ నటిస్తున్నారు. కాగా ఈ సినిమా మార్చి 4న విడుదల కానుంది.