జబర్దస్త్ ను ఆది వీడటంపై క్లారిటీ వచ్చేసింది

జబర్దస్త్ ను ఆది వీడటంపై క్లారిటీ వచ్చేసింది

0
91

ఓ ప్రముఖ ఛానల్ లో జబర్దస్త్ ప్రోగ్రామ్ ప్రసారం అవుతుంది… ఈ షో ప్రేక్షకులను చాలా ఏళ్లుగా అలరిస్తూ నవ్విస్తూ వస్తోంది… ఈ షో ద్వారా చాలామంది ఆర్టిస్టులు పాపులర్ అవ్వడమే కాకుండా కెరియర్ పరంగా నిలదొక్కుకున్నారు…

అంతిటి క్రేజ్ ఉన్న ఈ షో నుంచి తాజాగా నాగబాబు బయటకు వచ్చారు.. ఇక ఆయనతోపాటు కొంతమంది ఆర్టిస్ట్ లు మరో ఛానల్ షోకు వెళ్లిపోయారు… ముఖ్యంగా షోలో మంచి క్రేజ్ ఉన్న హైపర్ ఆది కూడా ఉంటాడా ఉండరా అనే సందేహాలు మొదలయ్యాయి…

ఆ షోలో ఉండేదెవరో వచ్చేవారంలో ప్రసారం కానున్న ఎపీసోడ్ ద్వారా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు… నాగబాబుకు ఆదికి మంచి సన్నిహిత సంబంధం ఉందని ఈ షో నుంచి ఆయన బయటకు రావడంతో ఆది కూడా బటకు వస్తారని వార్తలు వచ్చాయి… అయితే మల్లెమాల సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆది బయటకు వెళ్లే ఛాన్స్ లేదనే టాక్ వినిపిస్తోంది…