ఆది సినిమా రిలీజ్ డేట్ కన్ ఫర్మ్..!!

ఆది సినిమా రిలీజ్ డేట్ కన్ ఫర్మ్..!!

0
91

ఆది సాయికుమార్ కథానాయకుడిగా, ప్రముఖ రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’.. అక్టోబర్ 18న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తీవ్రవాదం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. యు/ఎ సర్టిఫికెట్ లభించింది.

‘వినాయకుడు’, ‘విలేజ్ లో వినాయకుడు’, ‘కేరింత’తో విజయాలు అందుకున్న సాయికిరణ్ అడివి, ఈసారి కాశ్మీర్ పండిట్ల సమస్యలను వెండితెరపై ఆవిష్కరించడానికి సిద్ధమయ్యారు. ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి గారు సినిమాలో ఓ పాట పాడటం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ.