ఆదిపురుష్ లో ప్రభాస్ కు హీరోయిన్ ఫిక్స్…

ఆదిపురుష్ లో ప్రభాస్ కు హీరోయిన్ ఫిక్స్...

0
89

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు.. ఆయన నటించబోయే తొలి డైరెక్ట్ హిందీ సినిమా ఆదిపురుష్… ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే ఒక ప్రకటన విడుదల అయిన సంగతి తెలిసిందే… ఈ ప్రకటన రాగానే దీనిపై విపరీతమైన క్రేజ్ పెరిగింది..

ఈచిత్రాన్ని ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది… ప్రముఖ నిర్మాత సంస్థ టీ సీరీస్ సుమారు 350 కోట్లతో ఐదు బాషల్లో నిర్మిస్తోంది… తాజాగా ఈ చిత్రం గురించి ఒక వార్త హల్ చల్ చేస్తోంది… విష్ణు అవతారమైన రాముడిని పోలిన పాత్రను ప్రభాస్ పోషిస్తాడని వార్తలు వస్తున్నాయి…

అలాగే డార్లింగ్ సరసన సీతాదేవి వంటి పాత్రను ఎవరు పోషిస్తారనే విషయం ఇప్పుడు చర్చనీంశం అయింది… ఇదే విషయం గురించి సోషల్ మీడియాలో ఒక వార్త హల్ చల్ చేస్తోంది.. ఈ పాత్రకు కీర్తి సురేష్ ని చిత్ర నిర్మాతలు పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి…