ఆదిపురుష్ లో మరో కీలకనటి….

ఆదిపురుష్ లో మరో కీలకనటి....

0
93

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించబోతున్న తొలి బాలీవుడ్ మూవీ ఆదిపురుష్ ఈ చిత్రం రామాయణం ఆధారంగా తెరకెక్కుతోంది… టీ సీరీష్ భూషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు…

ఈ మూవీని ఐదు బాషల్లో విడుదల చేయనున్నారు… ఇటీవలే ఈ చిత్రం గురించి అధికార ప్రకటన విడుదల అయినప్పటినుంచి అనేక వార్తలు వస్తున్నాయి.. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుందని దాని తర్వాత కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వచ్చాయి..

ఇక దే క్రమంలో మరో వార్త హల్ చల్ చేస్తోంది.. ఆదిపురుష్ లో మరో నటి ఊర్వశి రౌతేలా కీలక పాత్రలో నటించనుందని వార్తలు వస్తున్నాయి…. ఇటీవలే ఆమెను చిత్రం బృంధం సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి… అయితే ఈ వార్తలపై చిత్రబృంధం స్పందించింది… సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తల్లో ఏమాత్రం నిజంలేదని తెలిపింది….