ఆగస్ట్ 11, 2022న ఆదిపురుష్ విడుదల- దాని వెనుక రీజన్ ఇదే

ఆగస్ట్ 11, 2022న ఆదిపురుష్ విడుదల- దాని వెనుక రీజన్ ఇదే

0
104

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమాని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు
ఓం రావత్ తెరకెక్కిస్తున్నారు, ఇప్పటికే రెండు పాన్ ఇండియా సినిమాలు ఒకే చేశారు ప్రభాస్, ఇక ఈ సినిమా పై కీలక ప్రకటన వచ్చేసింది.. ఆగస్ట్ 11, 2022న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు చిత్ర యూనిట్.

ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, అయితే తాజాగా ఈ సినిమా సెట్స్ పై ఇంకా పెట్టాల్సి ఉంది, వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా స్టార్ట్ అవుతుంది.. అయితే ఎనిమిది నెలల్లో షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి విడుదల చేయాలి అని చిత్ర యూనిట్ భావించింది.

అయితే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాకి సంబంధించి యానిమేషన్ ఎడిటింగ్ కు సంబంధించి ఓ ప్రముఖ కంపెనీకి అందిస్తున్నారట, వారురెండు నెలల్లో ఫైనల్ అవుట్ పుట్ ఇవ్వనున్నారు, ఈ చిత్రం అందుకే అంత వేగంగా విడుదల చేస్తాము అని చిత్ర యూనిట్ ప్రకటన చేసింది అని బీటౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

భారతీయ ఇతిహాస నేపథ్యంలో రూపొందించబోతున్న ఆది పురుష్ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు,
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ లంకేశ్ గా కనిపించనున్నాడు. ఇక ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నారు.