ప్ర‌భాస్ ఆదిపురుష్ చిత్రంలో విలన్ ఎవ‌రంటే?

ప్ర‌భాస్ ఆదిపురుష్ చిత్రంలో విలన్ ఎవ‌రంటే?

0
138

స్టార్ హీరో ప్రభాస్ ఆదిపురుష్ సినిమాని అనౌన్స్ చేశారు.. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా క్తీర్తి సురేష్ పేరు ప‌రిశీలిస్తున్నారు అని వార్త‌లు వినిపిస్తున్నాయి, ఇక ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెర‌క్కిస్తున్నారు, ఐదు భాష‌ల్లో ఈ సినిమా రానుంది .అయితే చాలా మంది దిగ్గ‌జ న‌టులు ఇందులో న‌టించే అవ‌కాశం ఉంది అని తెలుస్తోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రచారమవుతోంది. ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించబోతున్నట్టు బీటౌన్ లో చర్చ జరుగుతోంది.
అయితే ఆయ‌న ఈ పాత్ర‌కు బాగా సెట్ అవుతారు అని భావిస్తున్నారు.

అయితే ద‌ర్శ‌కుడు గ‌తంలో కూడా ఆయ‌న‌తో అద్బుత‌మైన పాత్ర చేయించారు తానాజీ చిత్రంలో.. అందుకే ఇప్పుడు మ‌ళ్లీ ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమాలో ఇద్ద‌రు అద‌ర‌గొడ‌తారు అని ప్ర‌భాస్ సైఫ్ అభిమానులు భావిస్తున్నారు. మ‌రి దీనిపై ఇంకా వ‌చ్చే రోజుల్లో ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.