అది పక్కా ఫేక్ న్యూస్ దిల్ రాజు క్లారిటీ….

అది పక్కా ఫేక్ న్యూస్ దిల్ రాజు క్లారిటీ....

0
90

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు తనపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు… తాను రెండో పెళ్లి చేసుకున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు దిల్ రాజు…

ఒకవేళ వివాహం చేసుకోవాలని ఉద్దేశం ఉంటే అందరి సమక్షంలో వివాహం చేసుకుంటానని చెప్పారు… తాను ఇంకా రెండో పెళ్లి చేసుకోలేదని అన్నారు… కాగా మూడేళ్ల క్రితం దిల్ రాజు భార్య అనిత అనారోగ్య కారణంతో మరణించిన సంగతి తెలిసిందే…

ఇక అప్పటినుంచి ఆయన ఒంటరిగా ఉంటున్నారు… ఇటీవలే తన కుటుంబ సభ్యుల ఒత్తడి వల్ల 30 సంవత్సరాలు కలిగిన అమ్మాయిని ఎవరికి తెలియకుండా షాద్ నగర్ లో వివాహం చేసుకున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే తాజాగా ఆయన ఈ వార్తలపై వివరణ ఇచ్చారు…