ఆదిపురుష్ సినిమాకి సంగీతం ఎవరు అందిస్తారంటే

ఆదిపురుష్ సినిమాకి సంగీతం ఎవరు అందిస్తారంటే

0
98

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా అనౌన్స్ చేశారు, ఇప్పటికే ఈ సినిమాలో నటించే వారు ఎవరు అనే ఆసక్తి పెరిగిపోయింది, చిత్ర యూనిట్ కూడా పలువురు నటులతో సంప్రదింపులు జరుపుతోంది, అయితే ఈ సినిమాకి బాణీలు అదే సంగీతం ఎవరు అందిస్తారు అని చర్చ జరుగుతోంది.

మరీ ముఖ్యంగా మ్యూజిక్ కోసం మరోసారి కీరవాణిని రంగంలోకి దించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి, ప్రభాస్ ఆల్ టైం హిట్ సినిమాలకు కీరవాణి సంగీతం అందించారు, మరి కచ్చితంగా పౌరాణిక చరిత్రతో కూడిన సినిమా దీనికి సీనియర్లే సంగీతం అందించాలి అని భావిస్తున్నారు చిత్ర యూనిట్.

ఇప్పటికే కీరవాణి.. అన్నమయ్య, శ్రీరామదాసు, బాహుబలి సినిమాలతో ఎటువంటి సంగీతం అందించారో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇక కీరవాణికి ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు క్రిష్, పవన్ కళ్యాణ్ వంటి క్రేజీ చిత్రాలున్నాయి. సో 80 పర్సెంట్ ఆయనే బాణీలు అందిస్తారు అని తెలుస్తోంది.