ఆదిపురుష్ @100..రిలీజ్ ఎప్పుడో మరి?

Adipurush 100..will ever be released?

0
94

ప్ర‌భాస్ న‌టిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఆదిపురుష్ ఒక‌టి. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని పౌరాణిక నేప‌థ్యంలో రూపొందిస్తున్నారు. చిత్రంలో ప్ర‌భాస్ రాముడిగా క‌నిపించ‌నుండ‌గా, కృతి సనన్ సీత పాత్రలో, సైఫ్ రావణాసురుడిగా కనిపించబోతున్నారు. ఆదిపురుష్ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు. రెట్రోఫిల్స్‌తో కలిసి సంగీత దిగ్గజం టి-సిరీస్ ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తోంది.

గ‌త కొద్ది రోజులుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఆదిపురుష్ చిత్ర షూటింగ్ 100 రోజులు పూర్తి చేసుకుంది. ఫైనల్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా షూటింగ్ మరొకొన్ని వారాల్లోనే పూర్తి కానుంది. ఇప్ప‌టికే కృతి స‌న‌న్, సైఫ్ అలీ ఖాన్ పార్ట్ షూటింగ్ పూర్తైంది. ఈ చిత్రానికి “బాహుబలి” సిరీస్ కంటే ట్రిపుల్ వీఎఫ్‌ఎక్స్ ఉంటుందని స‌మాచారం.

భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా 2022 ఆగస్ట్ 8న విడుదల కానుంది. ఈ డేట్ గ‌తంలో ప్ర‌క‌టించ‌గా, ఫ్యూచ‌ర్‌లో మార్చిన ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. ఇవే కాక ప్రభాస్ రాధే శ్యామ్, సలార్, స్పిరిట్ వంటి వరుస సినిమాలు చేస్తున్నాడు.