ఆదిపురుష్ సినిమాలో కృష్ణం రాజు ఆయన పాత్ర ఏమిటంటే?

ఆదిపురుష్ సినిమాలో కృష్ణం రాజు ఆయన పాత్ర ఏమిటంటే?

0
99

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా ప్రకటించారు వచ్చే ఏడాది ఇది సెట్స్ పైకి వెళ్లనుంది.. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు, చరిత్ర ఆధారంగా తెరకెక్కే సినిమా అని తెలుస్తోంది.

ఇక రామాయణ గాథ తెరకెక్కించాలంటే ఎంతో మంది ఆర్టిస్టులు కావాలి. దీంతో ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులను ఫైనల్ చేసే పనిలో ఉంది చిత్ర యూనిట్. అయితే తాజాగా ఓ వార్త వినిపిస్తోంది, ఈ సినిమాలో విశ్వామిత్రుడిగా మోహన్ బాబుని పరిశీలిస్తున్నారట, అలాగే మరో కీలక పాత్ర శ్రీరాముడి తండ్రి పాత్ర దశరథుడిగా కృష్ణంరాజు నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

అయితే ప్రభాస్ తో గతంలో కూడా ఆయన సినిమాల్లో నటించారు, అయితే ఇప్పుడు ఈ సినిమాలో అవకాశం వస్తే నటించడానికి ఆయన ఒకే చెబుతున్నారట, అయితే దీనిపై దర్శకుడు కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. లేదా కన్నడ నటుడిని అయినా ఆ పాత్ర కోసం తీసుకోనున్నారట. మరి చూడాలి ఎవరు ఈ పాత్ర చేస్తారో.