ఆదిపురుష్ లో మోహన్ బాబు ? ఆయన పాత్ర ఏమిటంటే?

ఆదిపురుష్ లో మోహన్ బాబు ? ఆయన పాత్ర ఏమిటంటే?

0
90

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా అనౌన్స్ చేశారు, ఈ సినిమాలో నటీనటుల ఎంపిక కోసం ఇప్పటికే వర్క్ మొదలైంది, చాలా మంది సీనియర్ నటులతో సంప్రదింపులు జరుపుతున్నారు, ఇక హీరోయిన్లు ముఖ్యంగా సీత పాత్ర కోసం కీర్తి సురేష్, కియారా అద్వానీ, అనుష్క శర్మ పేర్లు వినిపిస్తున్నాయి. ఇంకా చర్చలు జరుపుతున్నారు.

అంతేకాదు ఈ సినిమాలో దేశంలో అన్నీ సినిమా రంగాల నుంచి నటులని తీసుకుంటారని తెలుస్తోంది.
మరోవైపు ఈ చిత్రంలో విశ్వామిత్రుడిగా మోహన్ బాబు పేరును పరిశీలిస్తున్నారు. మిగిలిన పాత్రల కోసం ఆయా భాషల్లో ఫేమస్ అయిన నటీనటులను తీసుకునే పనిలో ఉన్నారు చిత్ర యూనిట్.

అయితే ప్రభాస్ అంటే మోహన్ బాబుకు ఎంతో ఇష్టం, పైగా విలక్షణ పాత్రలు చేయడం అంటే మోహన్ బాబు కు ఇష్టం కచ్చితంగా ఈ పాత్ర వస్తే చేయడానికి ఆయన సిద్దంగా ఉంటారు అని టాలీవుడ్ లో చాలా మంది భావిస్తున్నారు, అయితే ఇప్పటీకే చాలా మందితో చర్చలు జరుపుతున్నారట, సో వచ్చే నెలలో దీనిపై ప్రకటన రానుంది అని తెలుస్తోంది.