యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం ఆదిపురుష్(Adipurush). ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా జూన్ 16న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో సినిమా(Adipurush) ప్రీరిలీజ్ ఫంక్షన్‌ను తిరుపతిలో నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్‌కు ఆధ్యాత్మిక వేత్త చినజీయర్ స్వామి గెస్ట్‌గా వస్తున్నారు. అయితే, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారట మేకర్స్. ప్రస్తుతం ఇండియా వైడ్‌గా ఎక్కడ చూసినా ఈ టాపిక్ గురించే చర్చ నడుస్తోంది. ఈవెంట్ కోసం మేకర్స్ దాదాపు రూ. 2.5 కోట్లు ఖర్చుపెడుతున్నారట. అంతేకాదు కేవలం క్రాకర్స్(ఫైర్ వర్క్) కోసమే 50 లక్షలు ఖర్చు చేస్తున్నారని సమాచారం. అయితే ఇప్పటివరకు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో ఇదే హైయెస్ట్ కావడం విశేషం. ఈ విషయం తెల్సుకున్న ఇండస్ట్రీ వర్గాలు షాకవుతున్నాయట. కేవలం ప్రీ రిలీజ్ కోసం ఇంత ఖర్చు చేయడం ఏంటని అవాక్కవుతున్నారట. రామాయణం ఆధారంగా వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్(Prabhas) రాముడిగా, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్(Kriti Sanon) సీతగా కనిపించనున్నారు.
‘ఆదిపురుష్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా?
-