Adipurush: ప్రభాస్ ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్..అదిరిపోయిన ఆదిపురుష్ అప్డేట్

0
111
Adipurush

Adipurush teaser to be released on october 2: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదిపురుష్’. ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుండి అప్డేట్ ఎప్పుడెప్పుడా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.

ఈ సినిమాలో ప్రభాస్ లుక్ తో కూడిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్ ఆకాశం వైపు బాణం సంధిస్తూ విభిన్నమైన లుక్ లో కనిపించారు. ఇక ఆదిపురుష్(Adipurush ) కు సంబంధించి మరో అప్డేట్ ను చిత్ర యూనిట్ తెలిపింది. అక్టోబర్ 2న సాయంత్రం 7 గంటల 11 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.

ఈ సినిమాలో ప్రభాస్(Prabhas) రాముడిగా కనిపించడంతో అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆదిపురుష్ సినిమా 2023 జనవరి 12న రిలీజ్ కానుంది. ఇక ప్రభాస్ ఆదిపురుష్ తో పాటు సలార్, స్పిరిట్, మారుతితో ఓ సినిమా చేయనున్నారు.

తగ్గేదేలే..Pushpa 2లో ఐటెం సాంగ్..అప్పుడు సమంత..ఇప్పుడు ఎవరంటే?