‘మాచర్ల నియోజ‌క‌వ‌ర్గం’ నుండి ‘అదిరిందే’ సాంగ్ రిలీజ్- వీడియో

0
101

ప్రస్తుతం యంగ్ హీరో నితిన్ వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. తాజాగా ఈ హీరో ప్ర‌ముఖ ఎడిట‌ర్ ఎంఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి దర్శకత్వంలో ప్రాధాన పాత్ర‌లో న‌టిస్తున్న లెటెస్ట్ చిత్రం ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’. యాక్ష‌న్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ఆగ‌స్టు 12న విడుద‌ల కానుంది.

ఈ నేపథ్యంలో చిత్ర‌బృందం వ‌రుస అప్‌డేట్‌ల‌తో ప్రేక్షకులను ఖుషి చేస్తున్నారు. తాజాగా మేక‌ర్స్‌ ఈ సినిమాలోని థ‌ర్డ్ సింగిల్ వీడియో సాంగ్‌ను విడుద‌ల చేశారు. ‘అదిరింది’ అంటూ సాగే మెలోడియ‌స్ వీడియో సాంగ్‌ను మేకర్స్ తాజాగా విడుద‌ల చేశారు. ఈ పాటకు కృష్ణ‌కాంత్ సాహిత్యం అందించగా..సంజిత్ హెగ్డే ఆల‌పించాడు.

దిగ్గ‌జ స్వ‌ర క‌ర్త మ‌ణిర‌త్నం కుమారుడు మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ ఈ చిత్రానికి సంగీతం స‌మ‌కూర్చాడు. ఈ పాట‌లో నితిన్‌, కృతి శెట్టి మ‌ధ్య‌ కెమిస్ట్రీ బాగా కుదరడంతో పాటు..డ్యాన్స్ మూవ్‌మెంట్స్ కూడా ప్రేక్షకులను అల‌రిస్తున్నాయి. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేయబోతుందో!

https://youtu.be/y8bRLf3SFBI