తెలంగాణలోని వనపర్తి శ్రీరంగపురం టెంపుల్‌లో హీరో సిద్దార్థ్(Siddharth), అదితిరావు హైదరి పెళ్లి జరిగిందని ప్రచారం జోరుగా జరిగింది. అయితే వీరి వివాహానికి సంబంధించిన ఎలాంటి ఫోటోలు, వీడియోలు లీక్ అవ్వలేదు. ఈ క్రమంలోనే సిద్దార్థ్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. “ఆమె ఎస్ చెప్పింది.. నిశ్చితార్థం జరిగింది” అంటూ ఇద్దరు తీసుకున్న సెల్ఫీ ఫోటోని షేర్ చేశారు. అలాగే అదితి కూడా “అతడు ఎస్ చెప్పాడు.. నిశ్చితార్థం జరిగింది” అంటూ సేమ్ ఫొటో పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో ఇద్దరూ కొత్త ఉంగరాలతో ఉన్నారు. దీంతో తమకు కేవలం నిశ్చితార్థం అయిందని పెళ్లి కాదని క్లారిటీ ఇచ్చేశారు.
కొంతకాలంగా ఇద్దరు ప్రేమలో ఉన్నట్లు వార్తలు ఊపందుకున్నాయి. ఇద్దరు కలిసి చాలా సార్లు విహారయాత్రలకు వెళ్లడం ఈ వార్తలకు బలం చేకూర్చింది. ఇద్దరు కలిసి తొలిసారిగా ‘మహాసముద్రం’ అనే సినిమాలో నటించారు. అప్పటి నుంచి ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. వీరిద్దరికి గతంలోనే పెళ్లి కావడం గమనార్హం. ఇద్దరూ(Siddharth, Aditi Rao Hydari) తమ పార్ట్‌నర్స్ నుంచి విడాకులు తీసుకున్నారు.