బాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు అనుమానస్పద మృతి

-

బాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు ఆదిత్య సింగ్ రాజ్‌పుత్(Aditya Singh Rajput) అనుమానస్పద మృతిచెందారు. సోమవారం అంధేరి ప్రాంతంలోని తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. దర్యాప్తు జరుగుతోందని ముంబై పోలీసులు తెలిపారు. లవ్, ఆషికి, కోడ్ రెడ్, ఆవాజ్ సీజన్ 9, బ్యాడ్ బాయ్ సీజన్ 4 వంటి ప్రాజెక్ట్‌లలో నటుడు కనిపించాడు. నటుడు అనేక సినిమాలు, షోలలో పనిచేశాడు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించాడు. ఇప్పటి వరకు క్రాంతివీర్, మైనే గాంధీ కో నహీ మారా వంటి చిత్రాలకు పనిచేశాడు. ఇది కాకుండా, అతను అనేక బ్రాండ్లకు పనిచేశాడు. అలాగే స్ప్లిట్స్‌విల్లా 9 వంటి రియాల్టీ షోలలో పాల్గొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

రాహుల్ గాంధీ రాక.. సైబరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు

Alltimereport, Desk : గిగ్ వర్కర్ల బైక్ ర్యాలీ(Gig Workers Rally)తో...

తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు..

Weather Update | తెలుగు రాష్ట్రాలకు మరోసారి తుఫాను (Cyclone) ముప్పు...