దర్శకులు కొత్త స్టోరీలు చెబితే యాక్సప్ట్ చేసే హీరోలు అతి తక్కువ మంది ఉంటారు, చెప్పాలంటే సరికొత్త ప్రయోగాలు చేయడం. అంతేకాదు రోటీన్ స్టోరీలకు భిన్నంగా కొత్త కథలతో ఆకట్టుకోవడం, ఇలాంటి హీరో ఎవరైనా ఉన్నారు అంటే వెంటనే చెప్పేది టాలీవుడ్ లో అడివిశేష్…కథలో కొత్త ధనం ఉంటే వెంటనే ఒకే చెబుతాడు, టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.
ప్రస్తుతం మేజర్– హిట్ 2సినిమాలు చేస్తున్నారాయన. ఇక ఆయన గురించి కొద్ది రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి, ఏమిటి అంటే శేష్ ప్రేమలో ఉన్నారు అని.. అయితే తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారాయన ఓఇంటర్వ్యూలో… ఓ హైదరాబాదీ అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు అంగీకరించారు. కాని ఇప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని వెల్లడించారు.
ఆమె గురించి పూర్తి వివరాలు చెప్పేందుకు ప్రేయసి దగ్గర అనుమతి తీసుకోలేదని అందుకే చెప్పడం లేదని మరో మెలిక పెట్టారు ఈ హీరో….మొత్తానికి అతని అభిమానులు మాత్రం ఎప్పుడు మీ ప్రేయసిని పరిచయం చేస్తారు అని అడుగుతున్నారు… వరుస సినిమాలతో అడివిశేషు బిజీగా ఉన్నారు, ఇంకా పలు కథలు కూడా వింటున్నారు.