అఫీషియల్ గా ప్రకటన చేసిన ఆచార్య చిత్ర యూనిట్

అఫీషియల్ గా ప్రకటన చేసిన ఆచార్య చిత్ర యూనిట్

0
90

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నారు ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు…

ఈసినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు… ఇందులో చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు, అలాగే కీలక పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు, ఇక తండ్రి కొడుకులని ఒకేసారి తెరపై చూడాలి అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

 

మెగా ఫ్యాన్స్ ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు… అయితే షూటింగ్ పూర్తి చేసి మే 13న సినిమా రిలీజ్ చేస్తాము అని చెప్పింది చిత్ర యూనిట్… ఇప్పటికే ప్రకటన వచ్చేసింది ..అయితే కరోనా పరిస్దితుల వల్ల షూటింగ్ ఆగింది.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆగిపోయాయి…దీంతో చిత్రం ఎడిటింగ్ పార్ట్ కూడా వర్క్ ఆగింది అని వార్తలు వినిపిస్తున్నాయి.

 

దీంతో మూవీ విడుదల మళ్లీ వాయిదా పడింది… తాజాగా ఈ సినిమా మేకర్స్ ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు పేర్కొన్నారు. కరోనా వలన చిత్రాన్ని మే 13న విడుదల చేయడం లేదు. పరిస్థితులు చక్కబడ్డాక కొత్త తేదీని ప్రకటిస్తాం అని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక చిరు బర్త్ డే రోజున చిత్రం రిలీజ్ అవ్వచ్చని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.