సినిమా పరిశ్రమలో ఎన్నో కష్టాలు పడి పైకి వచ్చిన వారు ఎందరో ఉన్నారు. తిండి కూడా లేక ఇబ్బంది పడిన స్టార్ హీరోలు ఎందరో ఉన్నారు. పలు సభల్లో ఇంటర్వ్యూల్లో ఈ విషయాలు పంచుకున్నారు. అయితే తమిళ నటుడు విజయ్ సేతుపతి ఇప్పుడు సినిమాల్లో ఎంత పెద్ద స్టారో తెలిసిందే. ఆయన చేతిలో దాదాపు 20 ప్రాజెక్టులు ఉన్నాయి. తాజాగా ఓ షోలో తన జీవితంలో పడిన ఇబ్బందుల గురించి తెలిపారు. విజయ్ సేతుపతి తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు పడ్డారు.
సైడ్ కారెక్టర్లు చేసే స్థాయి నుంచి ఇండియన్ స్టార్ గా ఎదిగారాయన. చదువుకునే సమయంలో ఆర్దిక ఇబ్బందులు ఉండటంతో పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుని జీవనం సాగించారట. బుల్లితెరలో మాస్టర్ చెఫ్ అనే ప్రోగ్రాంతో విజయ్ సేతుపతి సందడి చేయబోతోన్నారు.
ఈ సమయంలో ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. కుటుంబ పోషణ కోసం కొన్నాళ్లు ఫాస్ట్ఫుడ్ సెంటర్లో పనిచేసినట్లు తెలిపారు. తాను చెన్నైలో చదువుకునే సమయంలో కాలేజీ అయిపోయాక సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి 12.30 వరకూ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేసేవాడిని. అలా పనిచేసి ప్రతి నెలా రూ.750 జీతం సంపాదించుకున్నాను. మూడు నెలల పాటు టెలిఫోన్ బూత్లో కూడా పనిచేసినట్టు విజయ్ సేతుపతి తెలిపారు. ఆయన అభిమానులు మాత్రం ఈ మాటలు విని జీవితంలో కష్టపడిన వారు ఎప్పటికైనా విజయం సాధిస్తారు అంటున్నారు.