రెండో రోజు ‘ఏజెంట్’ మూవీ కలెక్షన్స్ తెలిస్తే షాకే.. మరీ ఇంత దారుణమా?

-

అయ్యగారు అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘ఏజెంట్(Agent)’ మూవీ బాక్సాఫీస్ దగ్గ బొక్కబోర్లా పడింది. ఎన్నో అంచనాలతో పాన్ ఇండియా స్థాయిలో ఏప్రిల్ 28న థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ అభిమానులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. తొలి ఆట నుంచే ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. దీంతో సినిమా కలెక్షన్స్ పై భారీ ప్రభావం పడింది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ8.60కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టగా.. రెండవ రోజు అయితే మరీ దారుణంగా రూ.1.65కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే సినిమా వసూళ్లు పూర్తిగా పడిపోయాయి. కేవలం రూ.67లక్షలు మాత్రమే వచ్చాయి.

- Advertisement -

నైజాం ఏరియాలో రూ.21లక్షల వసూళ్లతో అఖిల్(Akkineni Akhil) కెరీర్ లోనే పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఒక్కరోజులోనే రూ.7కోట్ల కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. దీంతో రెండేళ్లు పాటు హీరో అఖిల్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు లాగా అయిపోయింది. దాదాపు రూ.80కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం(Agent) మొత్తంగా 36.20 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. అంటే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.37కోట్లు వసూలు చేయాలి. ప్రస్తుత కలెక్షన్స్ చూస్తుంటే నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు తప్పేలా లేవు.

Read Also: మ్యాచ్ మధ్యలో కొట్టుకున్న ఫ్యాన్స్.. వీడియో వైరల్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...