ఆ హీరోని పెళ్లి చేసుకుందాం అనుకున్నా – సీక్రెట్ చెప్పిన మంచు లక్ష్మీ

ఆ హీరోని పెళ్లి చేసుకుందాం అనుకున్నా - సీక్రెట్ చెప్పిన మంచు లక్ష్మీ

0
89

మంచు లక్ష్మీ టాలీవుడ్ లో ఆమె తెలియని వారే ఉండరు.. ఆమె మల్టీ టాలెంటెడ్ అనే చెప్పాలి, అందం అభినయం అన్నీ ఉన్న ఆమె, సినిమాలు వరుసగా చేస్తూ బిజీగా ఉన్న హీరోయిన్, అంతేకాదు పలు ఇంటర్వ్యూలు హోస్ట్ గా చేస్తూ ఉంటుంది, స్పెషల్ కాన్సెప్ట్ లతో బుల్లితెరలో అలరిస్తుంది, ఆమె ఇంగ్లీష్ అంటే అందరికి ఇష్టం.

మంచు లక్ష్మీ వ్యాఖ్యాతగా, నిర్మాతగా ఇలా అనేక రంగాల్లో దూసుకుపోతోంది. మహిళామణులు అందరికి ఆమె ఆదర్శం అనే చెప్పాలి, ఈ సమయంలోతన లవ్ గురించి ఆమె బయటపెట్టారు, ఓ స్టార్ హీరో పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె ఎంతగానో బాధపడ్డారట. మరి ఆ హీరో ఎవరు అని అనుకుంటున్నారా.

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్. ఆయనకి పెళ్లి అయ్యేటప్పుడు ఏడ్చేసిందట.. ఆమెకి ఆమీర్ ఖాన్ అంటే చాలా ఇష్టం, ఆయన పెళ్లి జరిగిన సమయంలో చాలా బాధపడిందట, ఆయన మంచి సినిమాలు ఎంచుకుంటారు అని తెలిపింది, ఇక టాలీవుడ్ లో నాగార్జున అంటే చాలా ఇష్టమని తెలిపింది మంచు లక్ష్మీ.