ఆ హీరోని తన సినిమాలో సజెస్ట్ చేసిన అల్లు అర్జున్

ఆ హీరోని తన సినిమాలో సజెస్ట్ చేసిన అల్లు అర్జున్

0
103

ఈ కరోనాతో ఐదు నెలలుగా సినిమా షూటింగులు లేవు, తాజాగా పర్మిషన్ ఇవ్వడంతో మెల్ల మెల్లగా షూటింగులు స్టార్ట్ అవుతున్నాయి, అన్నీ జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ ప్రారంభించారు కొందరు, అయితే తాజాగా బన్నీ చేస్తున్న సినిమా పుష్ప ఈ సినిమా షూటింగ్ ఇంకా చాలా వరకూ ఉంది, మొదలు పెట్టిన కొద్ది రోజులకే లాక్ డౌన్ వచ్చింది.

దీంతో మళ్లీ తిరిగి షూటింగ్ ప్రారంభిస్తున్నారు, అయితే తాజాగా ఇందులో ఓ కీలక పాత్రకు మరో హీరోని తీసుకోవాలి అని చూస్తున్నారు, అయితే ఆ పాత్రకు నారా రోహిత్ అయితే బాగుంటాడు అని బన్నీ చెప్పారట.

రంగస్థలంలో ఆదిపినిశెట్టి రోల్ లాగే నారా రోహిత్ పాత్ర ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే నారారోహిత్ కూడా మంచి సినిమాలు వస్తే చేయడానికి సిద్దం పాత్ర ఏదైనా అద్బుతంగా చేయగలడు, అంతేకాదు హిట్ ప్లాఫ్ అనేది పట్టించుకోకుండా సినిమాలు చేస్తాడు, అయితే తాజాగా సుకుమార్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది, మరి చూడాలి దీనిపై ప్రకటన ఎప్పుడు వస్తుందో.