ఎయిర్ పోర్టులో ఫొటోగ్రాఫర్ ని పిలిచి తారక్ ఏం చేశాడో చూడండి

ఎయిర్ పోర్టులో ఫొటోగ్రాఫర్ ని పిలిచి తారక్ ఏం చేశాడో చూడండి

0
91

టాలీవుడ్ లో ఇప్పుడు దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రం గురించి చర్చ జరుగుతోంది.. ఈ సినిమా విడుదల ఎప్పుడు ఉంటుందా అని ప్రతీ ఒక్కరూ చర్చించుకుంటున్నారు, అయితే ఈ సినిమా గురించి అప్ డేట్ కూడా వస్తుంది అని అంటున్నారు వచ్చే నెలలో..

అయితే తాజాగా ఈ చిత్ర షూటింగులో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్, కాస్త షూటింగ్ గ్యాప్ రావడంతో ముంబైలో ఓ యాడ్ చేసేందుకు వెళ్లారు.. ఈ సమయంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది ఎయిర్ పోర్టులో…ముంబయి వెళ్లిన ఎన్టీఆర్ తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు. ఈ సమయంలో శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.

ఎయిర్ పోర్టు నుంచి బయటకు వస్తున్న తారక్ ని, ఓ ఫొటోగ్రాఫర్ ఫోటోలు తీశాడు , వెంటనే అతనిని గుర్తుపట్టి తారక్ దగ్గరకు పిలిచాడు, నువ్వసలు ఇంటికే వెళ్లవా… ఎయిర్ పోర్టులోనే ఉంటావా? తిండీ, స్నానం అన్నీ ఇక్కడేనా..?” అంటూ తనదైన శైలిలో అడిగారు దానికి అతను నవ్వుతూ సమాధానం చెప్పాడు. అయితే అతను అక్కడే ఎయిర్ పోర్టు దగ్గర సెలబ్రెటీలకు సంబంధించి ఫోటోలుతీస్తు ఉంటాడు.. పలుసార్లు తారక్ అతనిని గుర్తించాడు ఇప్పుడు తాజాగా ఆయనే పలకరించడంతో ఆ ఫొటోగ్రాఫర్ సంతోషంగా ఫీల్ అయ్యాడు.