చాలా మంది హీరోయిన్లు ముందు మోడలింగ్ రంగం నుంచి చిత్ర సీమలోకి ఎంట్రీ ఇస్తారు. ఇలా చాలా మంది తారలు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి వెండితెరపై అదరగొడుతున్నారు. ఇక మరికొందరు పలు యాడ్స్ లో కూడా నటించి హీరోయిన్స్ గా యాంకర్స్ గా కూడా మారారు.
సాషా చెత్రీ మోడలింగ్ నుంచే సినిమాల్లోకి వచ్చింది.ఎయిర్ టెల్ వాణిజ్య ప్రకటన ద్వారా సాషాకు మంచి గుర్తింపు వచ్చింది. దేశ వ్యాప్తంగా ఈ యాడ్ తో ఈమె ఎంతో పాపులర్ అయింది.
తాజాగా ప్రభాస్ సినిమాలో నటించే అవకాశాన్ని పొందింది.
రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రాధేశ్యామ్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో సాషా ఓ ముఖ్య పాత్ర పోషించిందట. ఈమె పాత్ర కథలో కీలకమైనదని తెలుస్తోంది.ఈ రోల్ తో ఆమెకు మంచి గుర్తింపు వస్తుందని అంటున్నారు. ఇక ఆమె గతంలో కూడా తెలుగులో ఓ సినిమా చేసింది. ఆపరేషన్ గోల్డ్ ఫిష్ చిత్రంలో నటించింది.