Aishwarya Rai | అభిషేక్‌తో కలిసి పార్టీకి వెళ్ళిన ఐశ్యర్యరాయ్.. పిక్స్ వైరల్..

-

బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్(Abhishek Bachchan), ఐశ్యవర్యరాయ్(Aishwarya Rai) విడాకులు తీసుకోనున్నారు. ఇప్పటికే లాయర్లను కూడా సంప్రదించారు అని కొన్నేళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది అయితే ఈ వార్తలు మరో అడుగు ముందకేసి విడాకులు అయిపోయాయని కూడా ప్రచారం జరిగింది. కూతురు సంరక్షణను ఐశ్వర్యరాయ్ తీసుకుందని, అందుకే వారిద్దరూ కలిసి కనిపిస్తున్నారని టాక్ మొదలైంది. ఇటీవల ఓ అవార్డ్ ఫంక్షన్‌లో ఈ వార్తలపై అభిషేక్ బచ్చన్ క్లారిటీ ఇచ్చారు.

- Advertisement -

అటువంటిదేమీ లేదని, భార్య చెప్పిన మాట వినాలని సూచించారు. అయినా ఈ వార్తలకు బ్రేకులు పడలేదు. కాగా తాజాగా ఐశ్వర్యరాయ్ షేర్ చేసుకున్న కొన్ని ఫొటోలు ఈ అనుమానాలను పటాపంచలు చేసేశాయి. అందులో ఐశ్వర్యరాయ్(Aishwarya Rai), అభిషేక్ కలిసి ఓ ఫంక్షన్‌కు వెళ్లారు. అక్కడ తన భర్తతో కలిసి ఐశ్వర్య సెల్ఫీలు తీసుకుంది.

అభిషేక్, ఐశ్వర్య కలిసి ఫంక్షన్‌కు వెళ్లారు. దీనిని ఇద్దరూ కూడా బ్లాక్ డ్రెస్‌ వేసుకుని వెళ్లారు. స్నేహితులతో కలిసి సెల్ఫీలు తీసుకున్నారు. ఈ మేరకు వారు దిగిన ఓ సెల్ఫీని ఎంటర్‌ప్రెన్యూర్ అను రంజన్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అందులో ఐశ్వర్యరాయ్‌తో పాటు ఆమె తల్లి బృంద్య రాయ్ కూడా ఉన్నారు.

ఈ సెల్ఫీలు అభిషేక్, ఐశ్వర్యరాయ్ విడాకుల వార్తలకు బ్రేకులు వేసిందని చెప్పొచ్చు. ‘ధైర్యవంతులు సమస్య నుంచి తప్పించుకోవడానికి విడాకులు లాంటి షార్ట్‌కట్‌ని ఎంచుకోరు. ఆ సమస్యను ఎలా పరిస్కరించాలని చూస్తారు. ఇప్పుడు ఐశ్వర్యరాయ్ చేస్తున్నది కూడా అదే’’ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Read Also: ‘మీ కుటుంబానికి నేనున్నా’.. రేవతి మృతిపై అల్లు అర్జున్
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...