భారాతీయుడు-2 సినిమా నుంచి తప్పుకున్న ఐశ్వర్య!

భారాతీయుడు-2 సినిమా నుంచి తప్పుకున్న ఐశ్వర్య!

0
98

కమల్ హాసన్ – శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ఇండియన్ -2 భారీ బడ్జెట్‌తొ తెరకెక్కనున్న ఈ చిత్రంలో విశ్వనటుడు కమల్ హాసన్ ద్విపాత్రాభినయం పోషిస్తున్నారు. ఆయన సరసన కాజల్ అగర్వాల్, ప్రియా భవానీ శంకర్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్లలతో పాటు మరికొంతమంది ముఖ్యపాత్రల్లో నటించనున్నారు.

ఈ నేపథ్యంలో కౌసల్య కృష్ణమూర్తి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఐశ్వర్య రాజేష్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర చేయనున్నట్టు ఈ మధ్య కాలంలో వార్తలు వచ్చాయి. కాని కోలీవుడ్ వర్గాల సమాచరం మేరకు ఈ సినిమా నుంచి ఆమె తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నందున, ఆమె భారతీయుడు – 2 సినిమాకు తన డేట్స్ ను అడ్జెస్ట్ చేయలేకపోతునట్టు సమాచారం. కాగా, ఐశ్వర్య రాజేష్ తెలుగు చిత్రం ‘కౌసల్య కష్ణమూర్తి‘ ఈ రోజే విడుదలై మంచి టాక్‌తో దూసుకెళుతుంది. రైతుల సమస్యలు, క్రికెటర్‌గా ఎదుగాలనుకొన్న యువతి కథను అద్భుతంగా మేళవిస్తూ చిత్రాన్ని రూపొందించారని రివ్యూస్ చెబుతున్నాయి.