బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేయడం కోసం మరో యువహీరో, హీరోయిన్‌లు సిద్ధమయ్యారు. బాలీవుడ్ అగ్రహీరో అజయ్ దేవగణ్(Ajay Devgn) మేనల్లుడు ఆమన్ దేవగన్(Aaman Devgan), రవీనా టాండన్ కుమార్తె రషా థడాని ప్రధాని పాత్రల్లో నటించిన తొలి సినిమా ‘ఆజాద్(Azaad)’ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
హిస్టారికల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతునన ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలిచేందుకు సన్నద్దమవుతోంది. చిత్ర బృందం ఈ సినిమా విడుదల తేదీని తాజాగా ప్రకటించింది. జనవరి 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని మూవీ యూనిట్ వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.
‘‘ఇది ఒక యోధుడి ప్రేమ కథ’’ అని పోస్టర్‌తో పాటు రాసుకొచ్చారు. ఈ సినిమాను హాల్దీఘాట్ యుద్ధ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు నిర్మాత రోనీ స్క్రూవాలా వెల్లడించారు. ఇందులో అజయ్ దేవగణ్, డయానా పెంటి(Diana Penty) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ యువ హీరో(Aaman Devgan), హీరోయిన్లు ఏమాత్రం సక్సెస్ అందుకుంటారో చూడాలి.