Naam | పదేళ్ల కిందటే పూర్తయిన స్టార్ హీరో సినిమా.. ఇప్పటికి రిలీజ్..

-

కొన్నికొన్ని సినిమాలు షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అన్ని పనులు పూర్తి చేసుకున్నా రిలీజ్‌కు మాత్రం నోచుకోవు. వాటిలో కొన్ని నెలలు, మరికొన్ని సంవత్సరం పాటు ప్రేక్షకుల ముందు సందడి చేయడానికి సమయం తీసుకుంటాయి. కానీ తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్(Ajay Devgn) నటించిన ఓ సినిమా అన్ని పనులూ పూర్తి చేసుకున్న దశాబ్దకాలం తర్వాత ఇప్పుడు రిలీజ్‌కు రెడీ అవుతోంది. ‘నామ్(Naam)’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా దశాబ్దం క్రితమే అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్నా ఎందుకో రిలీజ్‌కు మాత్రం నోచుకోలేదు. ఈ సినిమాకు బజ్మీ దర్శకత్వం వహించగా రూంగ్ట ఎంటర్‌టైన్‌మెంట్, స్నిగ్ద మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై అనిల్ రూంగ్ట నిర్మించాడు.

- Advertisement -

‘నామ్(Naam)’ సినిమా షూటింగ్ 2014లోనే ముగిసింది. కానీ రిలీజ్‌ రెడీ చేద్దాం అనుకునేలోపే నిర్మాతల్లో ఒకరు మరణించడంతో విడుదల వాయిదా పడింది. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ దొరకకపోవడంతో విడుదల అటకెక్కింది. ఇన్నాళ్లకు అన్ని చిక్కుముడులు విడిపోవడంతో ఇప్పుడు ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. ఈ సినిమా నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుందని మూవీ యూనిట్ వెల్లడించింది. ఇదిలా ఉంటే అజయ్ దేవగన్ నటించిన సింగం అగైన్, భూల్ భులయ్యా 3 సినిమాను నవంబర్ 1న రిలీజ్ కానున్నాయి.

Read Also: పెదాలు నల్లబడుతున్నాయా.. ఇలా చేయండి..
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...