అజిత్ – కార్తికేయ కొత్త సినిమా సూప‌ర్ ఛాన్స్

అజిత్ - కార్తికేయ కొత్త సినిమా సూప‌ర్ ఛాన్స్

0
99

ఆర్ఎక్స్-100 ఫ్రేమ్ కార్తికేయకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి …అయితే వ‌చ్చిన ప్ర‌తీ సినిమా అవ‌కాశాన్ని ఆయ‌న స‌ద్వినియోగం చేసుకుంటున్నారు.. తాజాగా నానీ హీరోగా గ్యాంగ్ లీడ‌ర్ చిత్రం వ‌చ్చింది. అందులో కార్తికేయ విల‌న్ గా అద్భుతంగా న‌టించారు. చిత్రానికి కార్తికేయ న‌ట‌న హైలెట్ గా నిలిచింది. అందుకే మంచి పేరు వ‌చ్చింది.

తాజాగా హీరోగా అవ‌కాశాలు చూసుకుంటూనే నెగిటీవ్ రోల్, విల‌న్ షేడ్ సినిమాలు వ‌చ్చినా, క‌థ ప్ర‌కారం బ‌ల‌మైన రోల్ అయితేనే చేస్తున్నాడు కార్తికేయ .. తాజాగా ఆయనకు తమిళ సినిమాలో ప్రతినాయకుడిగా నటించే అవకాశం వచ్చింది. తమిళ స్టార్ హీరో అజిత్ సినిమాలో విలన్‌గా నటించనున్నారు కార్తికేయ. ఇది కార్తికేయ‌కు జాక్ పాట్ అనే చెప్పాలి.

తాజాగా అజిత్ -శివ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది. ద‌ర్శ‌కుడు ఇప్ప‌టికే కార్తికేయ‌తో మాట్లాడార‌ని ఆయ‌న‌కి విల‌న్ పాత్ర గురించి చెప్పార‌ని, దీనికి యంగ్ హీరో ఒప్పుకున్నాడు అని తెలుస్తోంది.