అజిత్ మరో క్రేజీ దర్శకుడితో సంచలన సినిమా

అజిత్ మరో క్రేజీ దర్శకుడితో సంచలన సినిమా

0
93

కేఎస్ రవికుమార్ దర్శకుడిగా తమిళ్ లో సూపర్ హిట్ సినిమాలు తీశారు …తెలుగులో కూడా ఆయనకు మంచి హిట్ సినిమాలు వచ్చాయి… కాని ఇప్పుడు అన్నీ పరాజయాలే మూటగట్టుకుంటున్నారు, ఇక తమిళ్ లో స్టార్ హీరోలు ఆయనతో సినిమాలు చేయడం లేదు…ఇటు టాలీవుడ్ లో బాలయ్య బాబు ఆయనకు రెండు సార్లు అవకాశం ఇచ్చారు.

జై సింహా…రూలర్ ఈ రెండు సినిమాలు మంచి హిట్ అయినా వసూళ్ల పరంగా పెద్ద సాధించింది ఏమీ లేదు, అయితే ఈ సమయంలో ఆయనకు తమిళ స్టార్ హీరో అజిత్ నుంచి ఓ గుడ్ న్యూస్ వచ్చింది, అజిత్ ఆయనతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

ఈ విషయాన్ని కేఎస్ రవికుమార్ స్వయంగా తెలియజేశారు. చాలాకాలం క్రితం ఈ ఇద్దరి కాంబినేషన్లో విలన్ సినిమా వచ్చింది. అప్పట్లో ఆ సినిమా పెద్ద హిట్ అయింది .. అజిత్ స్థాయిని పెంచింది. అలా తనకి మంచి సినిమా ఇచ్చిన కేఎస్ కు అజిత్ ఓ సినిమా చేయాలి అని అనుకుంటున్నాడు. అజిత్ దగ్గర ఓ గొప్ప విషయం ఉంది, సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా కాస్త డల్ గా ఉంటే వారిని ఎంకరేజ్ చేస్తాడు.. అలాగే వారికి మంచి సినిమాలు తీసేలా తాను కూడా సైన్ చేసి వారితో సినిమాలు చేస్తాడు అందుకే ఆయనని బాగా అభిమానిస్తారు.