అఖండ చిత్రానికి బాలయ్య రెమ్యునరేషన్ ఎంతో తెలుసా – టాలీవుడ్ టాక్

అఖండ చిత్రానికి బాలయ్య రెమ్యునరేషన్ ఎంతో తెలుసా - టాలీవుడ్ టాక్

0
84

ఈ మధ్య చిత్ర సీమలో రెమ్యునరేషన్స్ గురించి టాక్స్ బాగా నడుస్తున్నాయి.. ముఖ్యంగా సీనియర్ ఆర్టిస్టులు క్యారెక్టర్ ఆర్టిస్టులు అలాగే హీరోయిన్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ కి సంబంధించి వారి రెమ్యునరేషన్ గురించి అనేక వార్తలు వింటూనే ఉన్నాం.. అయితే తాజాగా మన స్టార్ హీరోల రెమ్యునరేషన్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు.

 

అయితే సీనియర్ హీరో అయిన బాలయ్య బాబు రెమ్యునరేషన్ గురించి మాట్లాడుకుంటున్నారు అభిమానులు.. అఖండలో బాలయ్య బాబు లుక్ ని చూసిన ప్రతీ ఒక్కరు ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అంటున్నారు.. ఈ సినిమాలో బాలయ్య బాబు లుక్ డైలాగ్స్ అదరహో అనేలా ఉన్నాయి.

 

అయితే ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో తీస్తున్నారు, అంతేకాదు ఇందులో చాలా మంది సీనియర్లు నటిస్తున్నారు… ఇక నిర్మాణ వ్యయం కూడా ఎక్కువగానే ఉంటుంది… అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం బాలయ్య ఏడు కోట్లు వరకూ అఖండకు రెమ్యునరేషన్ తీసుకోవచ్చు అని టాక్ అయితే నడుస్తోంది…. అయితే ఒక్కో సినిమాకి బాలయ్య ఒక్కో రకంగా రెమ్యునరేషన్ తీసుకుంటారు, ఇక ఆయనతో సినిమా చేయాలి అని ఎంత మంది దర్శకులు క్యూ కడుతున్నారో తెలిసిందే.