అఖండకు హిట్ టాక్..బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు

Akhanda hit talk..Balayya interesting comments

0
129

నందమూరి నటసింహం బాలకృష్ణ-దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్​లో వచ్చిన ‘అఖండ’ అభిమానులకు ఫుల్​మీల్స్​ పెట్టేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్​లో కూడా హిట్​ టాక్​ కొట్టేసింది. ఈ నేపథ్యంలో చిత్రబృందం సక్సెస్​ మీట్​ ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ.. ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రానికి పని చేసిన అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ చిత్రానికి ఇంత అఖండ విజయం అందించిన ప్రేక్షక దేవుళ్లకు, నా అభిమానులకు అందరికీ నా కృతజ్ఞతలు.

కొత్తదనాన్ని తెలుగు వారు ఆదరిస్తారు అనడానికి ఉదాహరణ ఈ అఖండ. ఇది చలనచిత్ర పరిశ్రమ విజయం. తమన్​ మంచి బాణీలు సమకూర్చారు. మా సినిమాలో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కష్టపడ్డారు. సినిమానే మా ధ్యేయం. నేను ఓ డైరెక్టర్​ ఆర్టిస్ట్​ని.. కాబట్టి డైరెక్టర్​ ఎలా చెబితా అలా నడుచుకుంటాను.” అని నందమూరి బాలకృష్ణ అన్నారు.