వైరల్ అవుతున్న అఖండ మేకింగ్ వీడియో – బాలకృష్ణ అదుర్స్

0
101

సింహా’, ‘లెజెండ్’​ తర్వాత బోయపాటి- బాలయ్య కాంబోలో వచ్చిన హ్యాట్రిక్​ సినిమా ‘అఖండ’. డిసెంబర్​ 2న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. విదేశాల్లోనూ అఖండ అదరగొట్టింది. బాలయ్య కెరీర్ లో అఖండ చిత్రం అత్యధిక వసూలు చేసిన సినిమాగా నిలిచింది.

ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​గా నటించింది. శ్రీకాంత్, పూర్ణ కీలకపాత్రల్లో కనిపించారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. తాజాగా బాలయ్య నటించిన ‘ అఖండ’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. డిస్నీ హాట్ స్టార్ వేదికపై ఇటీవలే రిలీజ్ అయింది. ఇక అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

తాజాగా ఈ మూవీ మేకింగ్ వీడియోను విడుదల చేసింది చిత్ర యూనిట్. సినిమా పూర్తయ్యాక వచ్చే ఈ వీడియోను సపరేట్ గా విడుదల చేయగా ..దానికి కూడా లక్షల వ్యూస్ వస్తున్నాయి. షూటింగ్ లో బాలయ్యకు బోయపాటి సీన్లను వివరిస్తున్న సందర్భాలు ఈ మేకింగ్ వీడియోలో ఉన్నాయి.

https://fb.watch/aK0zKoZTZ_/