ద‌స‌రా – వినాయ‌కచ‌వితికి కాదు మ‌రి అఖండ రిలీజ్ ఎప్పుడు?

Akhanda Movie Release Updates

0
83

బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో అఖండ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. ఇక క‌రోనా వల్ల షూటింగ్ కాస్త లేట్ అయింది అయితే ఇటీవ‌ల ఈ షూటింగ్ ని వేగంగా పూర్తి చేస్తున్నారు. ఇందులో బాల‌య్య న‌ట‌న కోసం అంద‌రూ చూస్తున్నారు. ఇక బోయ‌పాటి ఇప్పటికే రెండు చిత్రాలు చేశారు బాల‌య్య‌తో. రెండూ సూప‌ర్ హిట్ ఇక అఖండ అంత‌కు మించి ఉంటుంది అంటున్నారు ఎన్. బీ. కే ఫ్యాన్స్ .

ఈ సినిమా మే నెలలో విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా వలన కలిగిన అంతరాయం వలన కుదరలేదు. దసరాకి ఆర్ ఆర్ ఆర్ రావడం ఖరారు కావడంతో ఈ సినిమాని ఇంకా ముందుగానే రిలీజ్ చేయాల‌ని చూస్తున్నారు. అయితే వినాయ‌క చ‌వితికి సినిమా థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తుంది అని అనుకుంటే, ఇంకా అప్ప‌టికి సినిమా వ‌ర్క్ పూర్తి కాద‌ని అంటున్నారు.

సెప్టెంబర్ చివరివారంలో గానీ అక్టోబర్ మొదటివారంలోగాని చిత్రం విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇక ఆచార్య కూడా రిలీజ్ డేట్ కోసం చూస్తున్నారు. ఈ రెండు చిత్రాలు కొంచెం అంటూ ఇటూలో ఓ ప‌దిరోజుల తేడాతో రిలీజ్ అయ్యే అవ‌కాశాలు ఉంటాయంటున్నారు టాలీవుడ్ అన‌లిస్ట్ లు.