సంక్రాంతికి సందడే..సందడి..ఓటీటీల్లోకి అఖండ, పుష్ప, శ్యాంసింగరాయ్..రిలీజ్ డేట్స్ ఫిక్స్

Akhanda, Puspa, Shansingarai into OTTs

0
101
Pushpa 2

ఓటీటీల్లో సందడి చేయడానికి భారీ చిత్రాలు సిద్ధమవుతున్నాయి. సంక్రాంతి కానుకగా అఖండ, పుష్ప, శ్యాంసింగరాయ్ సినిమాలు ఓటీటీల్లోకి రానున్నాయి. కరోనా తరువాత భారీ సక్సెస్ సాధించిన చిత్రాల్లో అఖండ నిలిచింది. బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా అఖండ నిలిచింది.

పాన్ ఇండియా మూవీగా వచ్చిన పుష్ప కూడా భారీ విజయాన్ని అందుకుంది. మరోవైపు శ్యాం సింగరాయ్ సినిమా కూడా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. జనవరిలో ఈ మూడు సినిమాలు ఓటీటీల్లోకి రానున్నాయి. రిలీజ్ డేట్స్ కూడా దాదాపు ఫిక్స్ అయ్యాయి.

బాలయ్య అఖండ మూవీ జనవరి మొదటివారంలో కానీ సంక్రాంతి రోజు కానీ హాట్ స్టార్ లో రానుంది. పుష్ప మూవీ అమెజాన్ లో సంక్రాంతికి రానుంది. నాని నటించిన శ్యాం సింగరాయ్ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో జనవరి చివరి వారంలో సందడి చేయబోతున్నాయి. దీంతో సంక్రాంతి పండగకు సినిమాల పండగ రాబోతోంది.