‘అఖండ’ ట్రైలర్ వచ్చేసింది..

0
81

నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ ట్రైలర్ వచ్చేసింది. అఘోరాగా డిఫరెంట్​ గెటప్​లో కనిపించిన బాలయ్య.. తన డైలాగ్స్​తో గర్జించారు. అభిమానుల్ని ఉర్రూతలూగిస్తున్నారు. అలానే సినిమాను థియేటర్లలో డిసెంబరు 2న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు.

ట్రైలర్ చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి

https://www.youtube.com/watch?v=CWnu8pQRCkQ&feature=emb_title

బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబోలో అలరించేందుకు సిద్ధమయ్యారు. త్వరలోనే విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, వీడియోలు, టీజర్లతో సినిమాపై భారీగానే హోప్స్ పెరిగాయి. బాలయ్య బాబుతో ప్రగ్యా జైస్వాల్ రోమాన్స్ చేయనుండగా, ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవిందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీకాంత్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.