Video: అఖిల్ ‘ఏజెంట్’ మూవీ టీజర్ విడుదల

0
89

అక్కినేని యువ హీరో అఖిల్‌ నటిస్తున్న తాజా సినిమా ‘ఏజెంట్‌’. సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మమ్ముట్టి ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. సాక్షి వైద్య కథానాయిక. ఈ సినిమా త్వరలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టారు చిత్ర యూనిట్.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్‌లో చూపించిన యాక్షన్‌ ఘట్టాలను చూస్తే సినిమా హాలీవుడ్ ను మరిపిస్తుంది. అఖిల్‌ ఆహార్యం, పలికిన సంభాషణలు ఆయన అభిమానుల్లో జోష్‌ నింపేలా ఉన్నాయి. శత్రు సైన్యాన్ని కట్టడి చేయడం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టే ‘ఏజెంట్’గా ఇందులో అఖిల్ నటిస్తున్నట్టు ఈ టీజర్ చూస్తే అర్థమైపోతుంది.

టీజర్ చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?v=DsdT3D_zKF0&feature=emb_title