బిగ్ బాస్ హౌస్ లో 14 వ వారం టాస్కులు జరుగుతున్నాయి, అయితే మూడు వారాలుగా కూల్ గా ఉన్న సోహైల్ మళ్లీ సీరియస్ అయ్యాడు, ఇదే ఇప్పుడు చర్చకు కారణం అవుతోంది..చైర్స్ పడేసుకుంటూ ఇష్టమొచ్చినట్టు చేశాడు టాస్క్ విషయంలో.
హారిక.. సోహైల్‌ని పిలిచి పువ్వుతో నాన్‌స్టాప్‌గా ప్రపోజ్ చేయాలని సోహైల్‌ను ఆదేశించింది. ఈ టాస్క్ లో మంత్రిగా రేస్ టు పినాలేకి వెళ్లిన అఖిల్ ఉన్నాడు, ఇది వద్దు ఈజీగా ఉంది అన్నాడు అఖిల్, దీంతో సోహైల్ కి చాలా కోపం వచ్చింది, తర్వాత మరో టాస్క్ ఇచ్చి, రెండు షూల లేస్‌ను కలిపి కట్టుకొని డ్యాన్స్ చేయాలంది. ఇందుకోసం 15 సెకన్లలో షూస్ తీసుకురావాలని అంది.
దీనికి అతనికి కోపం వచ్చింది బరాబరి ఇలాగే మాట్లాడతా అని అన్నాడు, తర్వాత షూలు తీసుకువచ్చి లేసు కట్టుకుని డ్యాన్స్ చేశాడు..అభిజీత్,మోనాల్, అరియానా ముందు ఉక్రోషాన్ని తన కోపాన్ని చూపించాడు.. ఇలా చేయకపోతే బట్టలు నీళ్లలో పడేయడం ఎంటర్‌టైన్‌మెంట్ అవుతుందా నేను కింగ్ గా చేశా ఇలా ఎప్పుడైనా జరిగిందా అని ఆమె అడిగింది. మరి ఫ్రెండ్ అఖిల్ పై సోహైల్ ఇలా గొడవ పడటంతో ఇప్పుడు వీరిద్దరూ ఎలా ఉంటారా అని ఆలోచన చేస్తున్నారు ఫ్యాన్స్ .