అఖిల్ సినిమాలో సమంత ఏ రోల్ అంటే

అఖిల్ సినిమాలో సమంత ఏ రోల్ అంటే

0
87

అక్కినేని వారసుడు అఖిల్ సినిమాల జోరు పెంచారు.. తాజాగా ఆయన బొమ్మరిల్లు భాస్కర్ తో చేయబోతున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌ లో శరవేగంగా జరుగుతుంది. మంచి ఫ్యామిలీ కథతో భాస్కర్ హిట్స్ కొడతారు, మరి తాజాగా అఖిల్ తో మరో హిట్ కు రెడీ అయ్యారు భాస్కర్, ఈ సినిమా గురించి ఎలాంటి లీక్స్ బయటకు రావడం లేదు.

తాజాగా ఈ సినిమా గురించి టాలీవుడ్ టౌన్ లో ఓ వార్త వినిపిస్తోంది….సమంత ఈ చిత్రంలో అతిధి పాత్రలో కనిపిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. అయితే ఇందులో అఖిల్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.

ఇక వీరిద్దరి మధ్య ఇప్పటికే పది రోజుల పాటు లవ్ సీన్స్ తీశారట.. సినిమాకి ఇవి మంచి ఎమోషనల్ టచ్ ఇచ్చే అంశాలు అని తెలుస్తోంది.. ఈ సీన్స్ ఇరువురి మధ్య బాగా వచ్చాయి అంటున్నారు .. అలాగే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు లవ్ స్టోరీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందట.. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నే నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్నారు.