అఖిల్ కు షూటింగ్ లో ప్ర‌మాదం గాయాలు

అఖిల్ కు షూటింగ్ లో ప్ర‌మాదం గాయాలు

0
136

అక్కినేని అఖిల్ గ‌ట్టి హిట్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు… అయితే ఈ స‌మ‌యంలో సినిమా షూటింగ్ లో ఆయ‌నకు ప్ర‌మాదం జ‌రిగింది, తాజాగా బొమ్మ‌రిల్లు భాస్కర్ డైరెక్ష‌న్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ మూవీలో నటిస్తున్నారు అఖిల్. ఈ చిత్రంలో అఖిల్‌కి జోడీగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తుండగా.. గీతాఆర్ట్స్2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు.

ఇప్ప‌టికే ఈ సినిమా 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది, తాజాగా చెన్నైలోని సినిమాకి సంబంధించి ఫైటింగ్ షెడ్యూల్ చేస్తున్నారు, ఈ స‌మయంలో అఖిల్ భుజానికి గాయం అయింద‌ని వారం రోజులు షూటింగ్ కు బ్రేక్ ఇవ్వాల‌ని డాక్ట‌ర్లు చెప్పారు,

గాయం చిన్న‌దే అయినా దానికి రెస్ట్ ఇవ్వాలి అని చెప్పార‌ట‌, దీంతో అఖిల్ హైద‌రాబాద్ చేరుకున్నారు, ఇక అఖిల్ ఈ సినిమాపై ఎన్నో హోప్స్ పెట్టుకున్నాడు… ద‌ర్శ‌కుడు కూడా హిట్ రికార్డ్ ఉండ‌టంతో ఈ చిత్రం పై టాలీవుడ్ లో కూడా అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు, వేస‌విలోనే ఈ చిత్రం రిలీజ్ చేయ‌నున్నారు.