పెద్ద దర్శకుడితో సినిమాకి సైన్ చేసిన అఖిల్

పెద్ద దర్శకుడితో సినిమాకి సైన్ చేసిన అఖిల్

0
84

అఖిల్ తన సినిమాల జోరు పెంచారు.. తాజాగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.. ఈ చిత్ర టైటిల్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్… ఇక ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి అయింది.. ఈ చిత్రం వచ్చే నెల వస్తుంది అని అనుకున్నారు.. కాని ఈ సినిమా వెండితెరపై ఏప్రిల్ నెలలో రానుంది అని తెలుస్తోంది.

అయితే అఖిల్ ఎప్పుడూ వరుసగా ఓ స్టోరీ తర్వాత మరో స్టోరీ వినలేదు.. కాని తాజాగా ఈసారి సినిమాలపై బాగా ఫోకస్ చేశారు.. ఇంకా ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా మరో స్టోరీ విని, లైన్ నచ్చడంతో ఒకే చెప్పారు.. అది కూడా క్రేజీ డైరెక్టర్ తో అని చెప్పాలి.

అవును సైరాతో మంచి సక్సస్ మీద ఉన్న దర్శకుడు సురేందర్ రెడ్డి తాజాగా అఖిల్ కు ఓ కథ చెప్పారట..
అది నాగార్జునకి కూడా నచ్చడంతో ఈ సినిమా ఒకే అయింది అని తెలుస్తోంది. ఈ సినిమా జూన్ లేదా మే నుంచి స్టార్ట్ అవుతుందట, ఈ సినిమాని మైత్రీ మేకర్స్ నిర్మిస్తున్నారట.