నాగ్ నిర్మతగా అఖిల్ సినిమా…

నాగ్ నిర్మతగా అఖిల్ సినిమా...

0
94

యువ కథనాయుకుడు అక్కినేని అఖిల్ సినిమాకి .. సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నాడు. అఖిల్‌కి సరైన ప్రాజెక్టులు సెట్ కాకపోవడం వలన సినిమాల మధ్య గ్యాప్ పెరిగిపోతోంది. ఇకపై అఖిల్ సినిమాలకు అలా జరగకూడదనే ఉద్దేశంతో తండ్రి అక్కినేని నాగార్జున ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. అలా నాగ్ గీతా ఆరట్స్ బ్యానర్లో అఖిల్ కోసం ఒక సినిమాను సెట్ చేశాడు. ’బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.

ఆ తరువాత పరశురామ్ దర్శకత్వంలో మరో సినిమాను సెట్ చేశాడనేది తాజా వార్త. అన్నపూర్ణ బ్యానర్లో ఈ సినిమా నిర్మతమవుతుందని టాక్. ’గీత గోవిందం’ హిట్ తరువాత దర్శకుడు పరశురామ్ అనుకున్న ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. దాంతో ఆయన అఖిల్ కోసం నాగ్ కి ఒక కథ వినిపించడం జరిగిందటా.. నాగ్‌కి ఆ కథ బాగ నచ్చేసిందట. దాంతో ఆ ప్రాజెక్టు ఖరారైపోయిందనేది తాజా సమాచారం.